సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ లలో ఆస్తి పన్ను బకాయిదారులకు ఆస్తి పన్ను పై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ పురపాలకశాఖ నేడు, మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పట్టణములో ( భీమవరం పురపాలక సంఘంలో సైతం) భవనాలు, ఖాళీ స్థలాలపై ప్రస్తుత సంవత్సరం చెల్లించాల్సిన మొత్తంతో పాటు, పాత బకాయిలపై వడ్డీని 50శాతం మేర మాఫీ చేస్తామని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉత్తర్వు లు జారీ చేసింది. దీని ప్రకారం 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
