సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, శనివారం రచ్చబండలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది ఆ రెండు పార్టీల అంతర్గత వ్యవహారమని, దానితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, ఎంపీ విజయ సాయిరెడ్డికి సంబంధం ఏమిటని? ప్రశ్నించారు. రేపు తెలంగాణాలో ఎన్నికల కౌంటింగ్ జరగనున్న దృష్ట్యా.. ఇప్పటికే సర్వేలు బట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న మాట నిజమేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. సర్వే అంచనాలే నిజమైతే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. కర్ణాటకలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో పుంజుకున్నట్లే, ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించనుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కాస్తా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా మారింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం ఖాయం. ప్రస్తుతం ఒక్క శాతం గా ఉన్న ఓట్లను 8 శాతానికి పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక్కొక్క శాతం కాంగ్రెస్ పార్టీకి పెరిగే ఓట్ల శాతం మావైసీపీ పార్టీకి సమ్మెట దెబ్బ కానుంది. కాంగ్రెస్ పార్టీకి తన తండ్రి పేరు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు,
