సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆగ్నేయ బంగాళాఖాతంలోప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు సోమవారం (ఈ నెల 8న అదే ప్రాంతం లో) అల్పపీడనం ఏర్పడనుంది. తదుపరి ఎల్లుండి 9న మంగళవారం వాయుగుండంగా మారనుంది. ఆ తరువాత తుపానుగా మారి ఉత్తరంగా పయనించి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉత్తర తమిళనాడు నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శనివారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండలు 42 డిగ్రీలు దాటినప్పటికీ సాయంత్రానికి మేఘ వృత్తం అయ్యింది.పలుచోట్ల వర్షాలు పడ్డాయి. అయితే రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుపాను ప్రభావం ఏపీలో వర్షాలకే పరిమితం కావచ్చును.
