సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన నేడు, సోమవారం రాష్ట్ర సచివాలయంలో 20 అంశాలపై కేబినెట్ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వీటిలో ప్రధానంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా యూనిట్‌గా చేయాలని కొంతమంది మంత్రులు కోరారు. అలా చేస్తే న్యాయ పరమైన చిక్కులు వస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నివేదికను యధాతధంగా ఆమోదిద్ధామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది. వైఎస్సార్ తాడిగడప పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చుతూ కేబినెట్ నిర్ణయించింది. సీఆర్డీఏ ఆధారిటీలో అమోదించిన 37,702 కోట్ల టెండర్లకు గానూ పనులు చేపట్టేందుకు కేబినెట్ అమోదం తెలిపింది.
