సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరల పెరుతుతుండటంతో .. కేరళలో కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ JN1పై అప్రమత్తంగా ఉండాలని .. కేరళలో ఏకంగా 5గురు మృతి చెందటంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ లో జగన్ సర్కార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ శీతాకాలం సీజన్ లో వచ్చే మాములు జ్వరాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ సన్న ద్ధతపై ఉన్న తాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృ ష్ణబాబు సమీక్షించారు. పట్టణాల నుండి గ్రామస్థాయి వరకు ర్యా పిడ్ కిట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. దీనితో రాష్డ్ర వ్యాప్తం గా 40 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చా యి. రోజుకి 60 వేలకి పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఏపీ కి ఉంది. మరోసారి ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్ , పనితీరు, మందులు సమీక్షించుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
