సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో పేద, ధనిక అనే తేడా లేకుండా.. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనుంది. 2వేల 493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం అమలు చెయ్యాలని నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *