సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు సోమవారం ప్రకటించారు. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇక ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధి రూ. 9,417 కోట్లు కేటాయించామన్నారు. ఇది యూపీఏ హయాంలో కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. అలాగే ఏపీలో రూ. 84,559 కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. అందులోభాగంగా 73 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశామని..ఏపీలో నూటికి నూరు శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందన్నారు.అలాగే ఏపీలో కొత్తగా 1,560 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మించామని అన్నారు. రాష్ట్రంలో 8 వందే భారత్ రైళ్లు16 జిల్లాలను కలుపుతూ ఏపీలో సేవలందిస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని వందే భారత్ రైళ్లు కేటాయిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.
