సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో,మెడికల్ కాలేజీలలో మొత్తం 424 అసిస్టెంట్ప్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి నేడు, మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వా రా భర్తీ చేయన్నుట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం .శ్రీనివాసరావు తెలిపారు. ‘‘సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెం ట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6న ఓల్డ్ జీజీహెచ్ , హనుమాన్ పేట , విజయవాడ డీఎం ఈ కార్యాలయం లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్ ఇన్ రిక్రూట్మెంట్ జరగనుంద’’ని ఆయన తెలిపారు. అలాగే.. బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఫిబ్రవరి 1 నుండి 15వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం https://dme.ap.nic.in లేదం టే.. http://apmsrb.ap.gov.in/msrb (http://apmsrb.ap.gov.in/msrb/)వెబ్ సైట్ లను పరిశీలించాలి.
