సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రైతులకు జగన్ సర్కార్ నేడు, బుధవారం వైఎస్సార్ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు విడుదల చేసారు సీఎం జగన్.ఈ పథకం ద్వారా రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ.13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు రైతు భరోసా సాయం అందించడంతో పాటు ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి అందించిన సాయం రూ. 11,500 అని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇవాళ మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ. 2,000 చొప్పున 53.58 లక్షల మంది రైతన్న ఖాతాల్లో రూ. 1,078.36 కోట్లు జమ చేసారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో మూడో విడతగా జిల్లాలో 1,27,114 మంది రైతులకు వారి ఖాతాల్లోరూ. 25,42,28,000 సొమ్ము జమా కానుంది. దీనిలో కౌలు రైతులు 6,712 మంది ఉం డగా వారికి రూ. 1,34,24,000 వారి ఖాతాల్లోజమ చేస్తారు.నియోజకవర్గాల వారీగా: ఆచంట నియోజకవర్గం లోని 27,286 మందికి రూ.5.45 కోట్లు, భీమవరంలో 10,823 మందికి రూ.2.16 కోట్లు, నరసాపురంలో 13,335 మం దికి రూ.2.66 కోట్లు, పాలకొల్లులో 12,768 మందికి రూ.2.55 కోట్లు, ట్లు తాడేపల్లిగూడెం లో 21,841 మందికి రూ.4.36 కోట్లు, తణుకులో 20,239 మందికి రూ.4.04 కోట్లు, ఉండిలో 14,356 మందికి రూ.2.87 కోట్లు, గణపవరంలో 6,466 మందికి రూ.1.29 కోట్ల సొమ్ము జమ చేస్తారు.అలాగే 2021–22 రబీ, 2022 ఖరీఫ్ పం ట రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ సొమ్ము 39,270 మంది రైతులకు రూ.5,53,28,442లు జమ చేస్తారు.
