సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ (AP Tenth Class Exam ) నేడు, శుక్రవారం విడుదల అయ్యింది. 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం,30 న సాంఘిక శాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్2), ఏప్రిల్ 1న సెకెండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *