సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలోని 20 కీలక కార్పొరేషన్ లకు చైర్మెన్ పదవులు ప్రకటించడం జరిగింది. వాటిలో కీలకమైన ఏపీ ఐ ఐ సి చైర్మెన్ గా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అడ్జక్షుడు మంతెన రామరాజు కు వరించడం తో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కూటమి ప్రజా ప్రతినిధులు ఆయనకు అబినందనలు తెలిపారు, దీనిలో భాగంగా ఆయన స్వంత నియోజకవర్గం ఉండి లో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు స్వయంగా వెళ్లి మంతెన రామరాజు కి apiic చైర్మన్ గా నియమితులైన సందర్భంగా నా శుభాభినందనలు తెలిపారు. ఈనేపథ్యంలో వారిరిరువురికి స్థానిక కూటమి నేతలు గజమాల వేసి సన్మానించారు.
