సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల ప్రచారంలో తన పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 నియోజకవర్గాలలో ఏ ప్రాంతాన్నికూడా వదిలేలా లేదు.. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు 2 లేదా 3 నియోజకవర్గాలలో గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నేడు, సోమవారం పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపర్రు, మల్లిపూడి, పొలమూరు, సత్యవరం, గ్రామంలో బీసీ వర్గానికి చెందిన పెద్దలు, యువత, మహిళలను కలిసారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిజానికి మెజార్టీ వర్గమైన బీసీలను వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ తమ రాజకీయ అవసరాలు ఉపయోగించుకుని వదిలేస్తున్నాయన్నారు. అయితే వాస్తవాలు గ్రహించిన సీఎం జగన్ మాత్రం బీసీలకు వెన్నుదన్నుగా ఉంటున్నారన్నారు. రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు స్థానాలతో పాటు, పలు అసేంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో అన్ని నామినేటేడ్‌ పదవుల్లోనూ బిసిలకు సముచిత స్థానం కల్పించి, కొత్త తరం లో బీసీలు నేతలను రాజకీయంగా ఎదుగుదలు ను ప్రోత్సహిస్తున్నారని సీఎం జగన్ కు బిసి లు వెన్ను దన్నుగా నిలబడి తీరాలని, వైసీపీ అభ్యర్థులందరిని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ప్రతి ఒక్కరు దీవించాలని కోరారు. ఎంపీపీ వాసు రెడ్డి ,మామిడి శెట్టి కృష్ణవేణి, బొక్క అరుణ, వెలగల వెంకటరమణా, చింతపల్లి గురు ప్రసాద్, కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నేటి సోమవారం సాయంత్రం ఆచంట నియోజవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి రంగనాథరాజు తో కలిసి సుడిగాలి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలోభాగంగా తూర్పుపాలెం గ్రామంలోని పార్టీ కార్యాలయం నుండి ప్రారంభించి శేషమ్మ చెరువు, కోటాల పర్రు, సోమరాజు చెరువు, దేవా, ములపర్రు, ఇలపర్రు, సిద్ధాంతం, వడలి, పెనుగొండ, ఆచంట గ్రామం వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,, జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ను ప్రవేశపెట్టి ఇంటి బాధ్యతలు మోస్తూ ప్రతి ఇంట్లోనూ జగన్ కుటుంబ సభ్యుడు అయ్యాడని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *