సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మణిపూర్‌తో పాటు ఈశాన్య ప్రాంతాల సత్వర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MDoNER) చేపట్టిన ప్రతిష్టాత్మక ‘పూర్వోత్తర్ సంపర్క్ సేతు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన మణిపూర్‌లోని నోనీ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడంతో పాటు, కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో శ్రీనివాస వర్మ సమీక్ష నిర్వహించారు. మొదట జిరిబామ్-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ వంతెనగా గుర్తింపు పొందిన ఐకానిక్ ‘నోనీ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణ పురోగతిని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సమీక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *