సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ జనతా పార్టీ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం అయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అత్యంత పిన్న వయస్కుడైన, 45 ఏళ్ళ వయస్సు ఉన్న, ‘నితిన్ నబీన్’ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నేడు మంగళవారం ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరు అయిన ప్రధాని మోడీ, అమిత్ షాలు నితిన్ ను అభినందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ ఎంపిక చేయడంతో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు త్వరలో దేశ వ్యాప్తంగా ‘జమిలి ఎన్నికలు’ జరుగుతాయి అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ప్రధాని మోదీ మంత్రివర్గంలోనూ భారీ మార్పులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం.. నితిన్ నబీన్ బిహార్ రాష్ట్ర బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తుండటం 5సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించడం గమనార్హం.
