సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ పార్టీలో సుమారు 4 దశాబ్దాలుగా అంచెలు అంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది పూర్తీ అయిన నేపథ్యంలో భీమవరంలోని బీజేపీ జిల్లా పార్లమెంటరీ కార్యాలయంలో ఎంపీ శ్రీనివాస వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో భీమవరం కు చెందిన మరో బీజేపీ ఎంపీ పాక సత్యనారాయణ, ఎమ్మెల్యే అంజిబాబు, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, నరసాపురం ఎమ్మెల్యే నాయకర్, టీడీపీ, మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, జిల్లా టీడీపీ అడ్జక్షుడు రామరాజు తదితర నేతలు, జిల్లా బీజేపీ నేతలు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. గత ఏడాది గా నరసాపురం పార్లమెంట్ పరిధిలో తాను చేసిన వందల కోట్ల అభివృద్ధి ని కొత్త నిర్మాణాలను నిధుల కేటాయింపులను వివరించారు. ఇంకా రాష్ట్రంలో విశాఖ ఉక్కు కు వేల కోట్ల కేంద్ర నిధులు తన హయాంలో వచ్చాయని వివరించారు.తాను ఈశాన్య రాష్ట్రాలలో 4గేసి రోజులు చప్పున పర్యటించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని సమర్ధవంతంగా వివరించానని అనాన్రు. అమరావతి ఫై సాక్షి ఛానెల్ డిబేట్ లో వచ్చిన వివాదాస్వాద వ్యాఖ్యలు ఖండిస్తున్నానని, జర్నలిస్ట్ కృష్ణంరాజు సరైన వ్యక్తి కాదని సంస్కారం లేని వ్యక్తి అని విమర్శించారు .. అమరావతిలో మీ కొంపలో ఏమి జరుగుతుందో అది మీకే పరిమితం చేసుకోవాలని అమరావతి మొత్తం మహిళలకు ఆపాదించడం మంచిది కాదని విమర్శించారు కేంద్ర మంత్రి వర్మ..
