సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: BSNL వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తీసుకొనివచ్చిన హోలీ ఆఫర్‌లో వినియోగ దారునకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రధానంగా రూ.1,499 ప్లాన్‌కు అదనపు వాలిడిటీ లభిస్తుంది. సాధారణంగా ఈ ప్లాన్ 336 రోజుల పాటు మాత్రమే వర్తిస్తుంది. కానీ ఇప్పుడు హోలీ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా మొత్తం 365 రోజుల పాటు వాలిడిటీ పొందవచ్చు. దీని ద్వారా యూజర్లు ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్, ప్రతి రోజు 100 SMS, 24GB వరకు హై-స్పీడ్ డేటా పొందే అవకాశం ఉంది. డేటా మొత్తం అయిపోయిన తర్వాత కూడా 40kbps స్పీడ్‌తో అదనపు డేటా వాడుకునే అవకాశం ఉంటుంది.ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు మార్చి 31లోగా తమ సబ్‌స్క్రిప్షన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ప్రయోజనాల కోసం BSNL రూ.2,399 ప్లాన్‌కూ అదనపు వాలిడిటీ అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్లాన్ 395 రోజుల వాలిడిటీతో అందుబాటులో ఉండేది. కానీ హోలీ ఆఫర్ కింద 425 రోజుల వరకు పొడిగించారు.
