సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఖ్యాతి గాంచిన భీమవరం కు చెందిన ప్రముఖ విద్య సంస్థలు విష్ణు ఫౌండేషన్ TBI, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ వారు ,జాతీయ స్థాయిలో ఆవిష్కరణలకు నాయకత్వం వహించే 75 మంది ఆవిష్కర్తలకు మద్దతునిచ్చేందుకు ‘బ్యుల్డ్’ చొరవతో IIT హైదరాబాద్లో ITIC ఇంక్యుబేటర్లో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. దీనిలోప్రతి ఏడాది కి ఎంపిక అయిన ప్రతి ఆవిష్కర్త లక్ష వరకు ప్రోత్సహకంగా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో 14 మంది ఇంక్యుబేటర్ల సహకారంతో అమలు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని ఐఐటి హైదరాబాద్లో Greenko Group Managing Director మరియు సిఇఒ డాక్టర్ అనిల్ కుమార్ మరియు ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ Professor బి.ఎస్. మూర్తి, డాక్టర్ ఎ.ఎస్. కిరణ్ కుమార్ (ఇస్రో మాజీ చైర్మన్), ఐఐటి హెచ్ ఫ్యాకల్టీ మరియు పార్టనర్ ఇంక్యుబేటర్ల సమక్షంలో ప్రారంభించారు. BUILD యొక్క ప్రాథమిక లక్ష్యం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు ఇటీవలి గ్రాడ్యుయేట్లు వారి వినూత్న ఆలోచనలకు రూపాన్ని అందించడానికి మరియు చివరికి స్టార్టప్ గా మారడానికి మద్దతు ఇవ్వడం.ఇందుకోసం ఆవిష్కర్తలు ITIC వెబ్ సైట్ www.itic.iith.ac.in/build నుండి జూలై 5, 2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *