సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆం ధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత.. గత వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ హయాం లో అవకతవకలు జరిగాయంటూ సీఎం చంద్రబాబు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం లోని సం క్షోభం .. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసారు. నేడు, సోమవారం సీఎం చంద్రబాబు . అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్య వహారం పై శ్వేత పత్రం విడుదల చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాం లో వీటన్నిటి పైనా దోపిడీ, ధ్వంసం జరిగిందని ఆరోపిస్తూ ..అయితే అవి రికార్డుల్లో అన్ని దొరకలేదు. క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా తవ్వితే తప్ప ఈ దోపిడీ ఎంత జరిగిందో చెప్ప లేమన్నారు. 2019-24 మధ్య ప్రధాన నగరాలలో పెద్ద ఎత్తున భూ కబ్జాల జరిగాయని.,ఇక పేదలకు ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోపిడీ జరిగిందన్నా రు. అక్రమం గా పార్టీ కార్యా లయాల కోసం భూమి దోచేశారని..అన్నారు. .విశాఖలో రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలివ్వడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ఎం పీ హయగ్రీవ పేరిట కోట్ల విలువైన భూమికొట్టేశారన్నా రు. ఎస్సీ , ఎస్టీల నుం చి 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారు. ఆవ భూములు, అటవీ భూములు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చి నివాసయోగ్యం కానీ చోట్ల ఇచ్చారు.” అని సీఎం చంద్రబాబు తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రం లో పేర్కొ న్నా రు.
