సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరం మండలం సరిపల్లె లో అక్రమంగా అకస్మాత్తుగా సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ మూసివేయడంతో ఉపాధి కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికులు తగిన నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం లోని కలెక్టర్ ఆఫీస్ వద్ద సిఐటియు నేతలు ధర్నా నిర్వహించి. జిల్లా కలెక్టర్ వారికి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం రూపంలో తెలియజేశారు జిల్లా కలెక్టర్ వారు సమస్యను పరిశీలించి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు JNV గోపాలన్, ఫ్యాక్టరీ కార్మికులు ఈ ధర్మా నిర్వహించి మాకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
