సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో కేంద్రప్రభుత్వ ఉద్యొగి స్థానిక భారత ఆహార గిడ్డంగులను పర్యవేక్షించే FCI మేనేజర్ ఏ.పెదబాబు రావులంచం తీసుకుంటుండగా CBI,మరియు సెంట్రల్ ACB అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. విషయంలోకి వెళ్ళితే.. భీమవరం FCI మేనేజర్ ఏ.పెదబాబు రావు అక్కడ గోడౌన్లలో పనిచేస్తున్న 35మంది హామాలీలనుండీ ప్రతీనెలా 25వేలు చప్పున లంచం తీసుకుంటున్నాడని స్థానిక హామాలీ మేస్త్రి వెంకటేశ్వరులు CBI,ని ఆశ్రయించి పిర్యాదు చెయ్యడంతో వారు ప్యూహాత్మక గా వచ్చి పెద్దబాబు 15వేలు లంచం తీసుకుంటుండగా CBI , DSP మధుసూధన్ ఆద్వర్యంలో సిబ్బంది దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. వెంటనే స్థానిక FCI కార్యాలయంలోనూ నిందితుడైన పెదబాబురావు ఇంటిలో సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుని వైజాగ్ తరలించారు. నేడు, శనివారం CBIకోర్టులో పెదబాబూరావును అధికారులు హాజరుపరుస్తారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *