సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కు, నేడు, 75వ జన్మదినం సందర్భముగా తెలుగు రాష్ట్రాలలో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “నా మంచి స్నేహితుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం. ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మాజీ సీఎం జగన్ కూడా చంద్రబాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
