సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని స్దానిక దంతులూరి నారాయణరాజు కళాశాలలో 2001-02 విద్యాసంవత్సరం నుండి 2019-20 విద్యాసంవత్సరం వరకూ డిగ్రీ కోర్సులలో జాయిన్ అయి, పరీక్షలలో ఉత్తీర్ణత సాదించని విద్యార్ధులకు స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినినేషన్స్ నిర్వహించటం జరుగుతుందని దానికి సంబంధించిన నోటిఫికేషన్ నేడు, మంగళవారం విడుద చేసామని కళాశాల ప్రిన్సిపాల్, జి.మోజెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండు రంగరాజు లు పాల్గొని స్పెషల్ డ్రైవ్ కు సంబంధించిన నోటిఫికోషన్ విడుదల చేసారు. వారు మాట్లాడుతూ.. 2001-02 నుండి 2019-20 వరకూ కళాశాలలో జాయిన్ అయి ఉత్తీర్ణత సాదించని విద్యార్ధులకు ఒక సువర్ణ అవకాశం అని తెలిపారు. ఈ పరీక్ష జనవరి / ఫిబ్రవరి 2026 లో నిర్వహిస్తామని తెలియజేసారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్ లో ఉత్తీర్ణత సాధించక పోతే వారికి భవిషత్యులో మరొక సారి పరీక్షలు నిర్వహించటం జరుగదని తెలిపారు. కావున ఫెయిల్ అయిన అభ్యుర్దులకు డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోతారని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *