సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానికంగా ఉన్న డి.ఎన్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యందు విద్యార్థుల సౌలభ్యం కోసము మరియు పెరిగిన అదనపు తరగతుల అవసరార్థము సుమారు రు.50 లక్షల రూపాయలు ఖర్చుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కంప్యూటర్ ల్యాబ్ ను, నేడు,మంగళవారం కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు), మరియు ఉపాధ్యక్షులు, గోకరాజు పాండురంగ రాజు, సంయుక్తంగా ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ .. ప్రస్తుత కంప్యూటర్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల అనుగుణముగా ఏఐ , మెషిన్ లెర్నింగ్ , డేటా సైన్స్ వంటి కోర్సులకు ఉన్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకొని మా కళాశాల విద్యార్థులకు ఉద్యోగ సాధనే లక్ష్యముగా శిక్షణ పొందటానికి ప్రస్తుతం ఉన్న 16 కంప్యూటర్ ల్యాబ్తో పాటు ఒక గ్లోబల్ ప్లాటపాంగా ఈ నూతన అడ్వాన్సుడ్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించానన్నారు. .
