సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ప్రముఖ విద్యాసంస్థ DNR ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ నాలుగవ సంవత్సరం చదువుతున్న కుమారి ఇంటి రూప అనే విద్యార్థినికి DNR కళాశాల పాలకవర్గ మాజీ సభ్యులు, పెన్మెత్స జగ్గరాజు RS . 25000 /- ఆర్ధిక సహాయం కళాశాల పాలకవర్గ కార్యదర్శి, గాదిరాజు సత్యనారాయణ రాజు ( బాబు) గారి చేతుల మీదుగా నేడు, ఆదివారం అందచేశారు ఈ సందర్భం గా గాదిరాజు బాబు మాట్లాడుతూ.. జగ్గరాజు గారు పలువురు విద్యార్థులకు ప్రతీ సంవత్సరం చదువుకి కావలసిన సహకారాన్ని అందిస్తూ వారి భవిష్యత్తుకు అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారని అనాన్రు. తమ పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహ రాజు గారి చొరవతో ఎంతో మంది ప్రముఖులు కళాశాలలో చదువుతున్న పేద మెరిట్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఆర్ధిక ప్రోత్సహాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో సుమారు 520 మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ మరియు ప్లేసెమెంట్స్ అందించామని అన్నారు. దాత , పెన్మెత్స జగ్గరాజుమాట్లాడుతూ.. కళాశాల ఈ విద్యా సంవత్సరం లో NAAC A ++ గుర్తింపుతో పాటు మూడు బ్రాంచి లకు NBA గుర్తింపు సాధించినందుకు తాము చాలా హర్షిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో కొత్తపల్లి శివ రామ రాజు , ప్రిన్సిపాల్ డా ఎం అంజాన్ కుమార్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *