సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం డి.యన్.ఆర్ కళాశాల ప్రాంగణంలో నేడు, శుక్రవారం నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 34 మంది విద్యార్ధులకు ‘హెట్రో డగ్స్’ అనే ఫార్మాస్యూటికల్స్ సంస్ధలో ఒక్కొక్కరికి, సుమారు రూ.3.00 లక్షలు పైబడిన వార్షిక ప్యాకేజ్ తో ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి అని కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంత కుమారి తెలిపారు. ఈ సందర్బంగా కళాశాల వైస్ ప్రెసిడెంట్, గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ.. కళాశాలలో ప్రతీ సంవత్సరం క్రమ పద్దతిలో అనేక పర్యాయాలు ప్రాంగణ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ డి.యన్.ఆర్ కళాశాలో చదివిన విద్యార్దులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. డి.యన్.ఆర్ కళాశాలలో విద్యార్ధులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రత్యేక తర్పీదు, శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తూ దేశములో ప్రఖ్యాత కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు,పి.రామకృష్ణంరాజు కళాశాల ప్లేస్ మెంట్ ఆఫీసర్ యమ్.డి.శిరాజ్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి పి.శిరీష్ కుమార్, అధ్యాపకులు, అద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు
