సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం దంతులూరి నారయణరాజు కళాశాల DNR అసోసియేషన్ పాలకవర్గ అసిస్టెంట్ సెక్రటరీ, కె.శివరామరాజు నేడు, శనివారం (ది. 19-10-2024) న మరణించారు. ఈ సందర్బంగా కాలేజీ లో ఏర్పాటు చేసిన సంతాప సభలో పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మరియు కార్యదర్శి మరియు కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) మాట్లాడుతూ .. శివరామరాజు డి.యన్.ఆర్ కళాశాల అసోసియేషన్ పాలవర్గ సభ్యునిగా 2013 నుండి, ఇక అసిస్టెంట్ సెక్రటరీ గా 2023 సంవత్సరం నుండి తన సేవలను అందిస్తున్నారని ఆయన చేసిన సేవలు డి.యన్.ఆర్ కళాశాల అసోసియేషన్ ఎన్నటికీ మరువలేనిదని ఆయన నిస్వార్దంగా అసోసియేషన్ లోని లవివిధ విద్యా సంస్దల అభివృద్దికి తన వంతు సేవలు అందిచారని అన్నారు. ఈ సంతాప సభలో ఉపాద్యక్షులు గోకరాజు పాండు రంగరాజు, సంయుక్త కార్యదర్శి కె.రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు, డీఎన్ ఆర్ విద్యాసంస్దల ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టార్ లు , అద్యాపక అద్యాపకేతర సిబ్బంది పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. సౌమ్యులు కె.శివరామరాజు మృతికి వారి కుటుంబానికి మన సిగ్మా న్యూస్ సంతాపం తెలియజేస్తుంది.
