సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ ఎంపీ,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)నేడు, శుక్రవారం భారత ఎన్నికల అధికారులను తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు.. ఇటీవల వివిధ రాష్ట్రాలలో జారుతున్నఎన్నికలలో ఎన్నికల కమిషన్ బీజేపీ గెలుపు కోసమే ఓట్ల చోరీకి పాల్పడుతోందని దానికి తనవద్ద 100 శాతం ఆధారాలు సేకరించి ఉంచానని సంచలన ప్రకటన చేసారు. మొన్న మహారాష్ట్రలో ఏవిధంగా ఓట్ల చోరీ (Vote Fraud) జరిగిందో? బిహార్‌లోనూ అదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ, మేము వాటిని బహిరంగ పరిస్తే ఈసీ ఏధంగా ఓట్ల చోరీ చేస్తోంది, ఆ ఓట్లలో ఎందుకు వస్తున్నాయో ? యావద్దేశానికి తెలుస్తుంది’ అని రాహుల్ అన్నారు. తమ ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఓట్ల చోరీపై తమ పార్టీ స్వతంత్ర విచారణ జరిపిందని రాహుల్ తెలిపారు. ఇందు కోసం 6 నెలలు పట్టిందన్నారు. ‘అటం బాంబు’ వంటి వివరాలు వెలికితీశామని, ఆ బాంబు పేలితే ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదని రిటైర్ అయినా సరే.. అక్రమాలు కు సహకరించిన అధికారులకు శిక్ష తప్పదని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ECI)తాజగా తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, బాధ్యతా రహితమని ఇలాంటి బెదిరింపులను తాము పట్టించుకోమని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *