సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో ఇక మరో 6 రోజులలో అంటే జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా
నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పగడ్బందీగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనరు రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్సు లో విజ్ఞప్తి చేసారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలు ప్రకటించాలన్నారు. సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని, కౌంటింగుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించామని, పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించామని , ఎన్నికల సిబ్బందితో పాటు హైస్పీడు ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐటీపరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిద్ధం చేస్తున్నామని, కచ్చితమైన ఎన్నికల ఫలితాలను వేగంగా ప్రకటించేలా చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. కౌంటింగ్ జరిగేటప్పుడు ప్రత్యక భోజన విరామం ఉండదని, కౌంటింగ్ హాల్లోనే విధుల్లో ఉన్న సిబ్బందికి ఆహారం అందిస్తారన్నారు. పోటీలో ఉన్నఅభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, తదితరులకు పాసుల ను జూన్ 2 నాటికిపూర్తి చేస్తామన్నారు.
