సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ హర్యానా ఎన్నికల ఫలితాలను ఏపీ పలితాలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు సూచనలతో విదేశాలలో జరిపిన కుట్ర మూలంగానే EVM ట్యాపరింగ్ జరిగి ఇక్కడ కూటమి గెలచిదేమోనని , తమ వాళ్ళు నాయ్యపోరాటానికి సిద్దమైన కూడా టీడీపీ వాళ్ళు వారిని త్రొక్కి ఉంచారని జగన్ అనుమానాలను వ్యక్తం చెయ్యడం ఫై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఈవీఎంలపై చెత్త మాటలు మాట్లాడటానికి జగన్‌కు సిగ్గుండాలి అన్నారు. జగన్ రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద అరిష్టం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలానికి మారు పేరుగా వైసీపీ మారితే.. బూతుల్ని పేటెంట్‌గా వైసీపీ నాయకులు తీసుకుంటున్నారంటూ విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు జరుగుతున్న నష్టంపై ఒక్కసారి కూడా నోరుమెదపని వారు.. ఇప్పుడు తమను విమర్శిస్తారా? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకూడదని, అదే సమయంలో నష్టాలకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్నామని మొన్నటి వరదల్లో 10 రోజులు బురదలోనే ఉన్నామన్న సీఎం చంద్రబాబు.. వరదల సమయంలో ప్రతిపక్ష నేతలు ఎక్కడ ఉన్నారు? ప్రశ్నిచారు. దాతలు నుండి వరద బాధితుల కోసం విరాళాలు CMRFకు రూ.450కోట్లు వరకు వచ్చాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *