సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైలు తత్కాల్ టికెట్ ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ నెల 1 నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్ టికెట్లు తీసుకునేందుకు ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి చేసిన రైల్వే అధికారులు, ఈ నెల 15 తర్వాత రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలోనూ ఆధార్ ఆధారిత ఓటీపీ విధానాన్ని అమలుచేస్తామని ప్రకటించారు. అయితే.. గత మూడు రోజులుగా రిజర్వేషన్ సిబ్బంది ఆధార్ లేకుండానే టికెట్లు జారీ చేస్తున్నారు. ఆధార్ అథంటికేషన్ ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా కొత్త విధానాన్ని తాత్కాలింగా వాయిదా వేసినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్‌ఐఎస్) అధికారులు తెలిపారు. పాత పద్దతిలో ఒక నిమిషంలో నాలుగు టికెట్లు ఇస్తున్నామని, కొత్త విధానంలో ఆధార్ అథంటికేటెడ్ ఓటీపీని నమోదు చేయాల్సి వస్తే ప్రతీ టికెట్టు జారీకి కనీసం 52 సెకన్ల చొప్పున సమయం పడుతుందని అంటున్నారు. టికెట్ జారీలో ఆలస్యాన్ని నివారించడం సాధ్యం కాకపోవడంతో ఆ పద్ధతిని సీఆర్‌ఐఎస్ తాత్కాలింగా వాయిదా వేసిందని చెబుతున్నారు.
