సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఏపీ ఎన్నికలలో ప్రజాకర్షణ హామీలతో అధికారమే లక్ష్యంగా.. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేడు, మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసారు. ఇందులో ప్రజా సంక్షేమ పధకాల ను వైసీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. ఈ కూటమి మ్యానిఫెస్టో లో హామీలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో పెన్షన్లు పొందే వృద్దులకు నెలకు 4వేల రూపాయిలు ఇస్తామని ప్రకటించింది. ( వైసీపీ ఇటీవల 3500 కు పెంచుతామని ప్రకటించింది)అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇక.. వికలాంగులకు రూ. 6 వేలు, పూర్తి వికలాంగులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తామని కూటమి ప్రకటిచింది. బీసీలకు అనేక వరాలు ప్రకటించారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతాం. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు.. బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు.. నిధులు కేటాయిస్తామని అన్నారు. పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్ఇస్తామన్నారు. మత్స్యకారులను ఆదుకుంటాం. డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం. బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేం సర్దుబాటు చేసుకున్నాం. 20 లక్షల మంది యువతకు ఉపాధిక్రింద నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతాం..కుటంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు చప్పున ఇస్తామని, స్కిల్ గణన చేపడతాం అన్ని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు.. ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశాం. సూపర్ సిక్స్.. షణ్ముఖ వ్యూహం వంటివి ఇప్పటికే ప్రకటించాం అన్నారు.
