సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 22 నుంచి దేశంలో వినియోగ వస్తువులపై, సేవలు, మందులపై కేంద్రం భారీ టాక్స్ లు తగ్గిస్తూ జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చి వారం రోజులు అయి నేపథ్యంలో సుమారు 83 కేట గిరీలకు సంబంధించిన వాటిపై ధరలు తగ్గవలసి ఉంది.. గతంలో నాలుగు శ్లాబ్‌లు ఉంటే.. ప్రస్తుతం రెండు శ్లాబ్‌లకే పరిమితం చేశారు. కానీ ఎక్కడా ఇవి పూర్తి స్థాయిలో అమల్లోకి రావడంలేదు. చాల మంది వ్యాపారులు మేము గతంలో పాత జీఎస్టీ చెల్లించిన పాత సరుకు ఉందనే కారణం చెప్పి పాత ధరలే వసూలు చేస్తున్నారు. అసలు పాత ధర.. ఇప్పుడు తగ్గిన ధర ప్రదర్శించాలని కేంద్రం ప్రకటించిన ఏ షాపింగ్ మాల్ లో కూడా ఈ తరహా వివరణ పాటించడం లేదు. పైగా కొన్ని వస్తువులు ధరలు మరింత పెంచేసి వినియోగదారుల జీఎస్టీ తగ్గింపు ను కూడా వారే లాభపడుతున్న కంపెనీలు, వ్యాపారులు కూడా ఉన్నారు. అయితే పాల ఉత్పత్తులు, టీవీలు, ఏసీలు వంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులు, కార్లు, మోట్లారు సైకిళ్లపై కొంత మేర తగ్గింపు ఆఫర్స్ లో కనపడుతుంది. కార్లపై అయితే భారీ స్థాయిలో రూ.50 వేల నుంచి రూ.లక్ష న్నర వరకూ రేట్ల తగ్గింపు అమలు అవుతుంది. పెట్రోల్ బైక్ లపై కూడా రూ.15 వేల వరకూ తగ్గింపు కనపడుతుంది తప్ప ఎలక్ట్రికల్ బైక్ లపై పెద్ద ప్రభావం లేదు. సిమెంట్ ధరలపై ఫై కూడా పెద్ద ప్రభావం లేదు. మరి తగ్గిన జీఎ స్టీ శ్లాబ్‌ వల్ల ప్రజలకు ఎప్పటికి ప్రయోజనం? లభిస్తుందనే స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అవగాహన సదస్సులు పలు పట్టణాలలో వచ్చే నెల 18వ తేదీ వరకూ ప్రచారం చేస్తున్నారు. మరి దీపావళి పండుగ వరకూ చర్యలు తీసుకోరా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *