సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు(82) నేడు, మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భౌతిక కాయానికి నివాళ్లు అర్పించడానికి స్థానిక నివాస గృహం వద్ద ప్రజలు, రాజకీయ పార్టీల రహితంగా జిల్లా వ్యాప్తంగా నేతలు భారీ సంఖ్యలో చేరుకొన్నారు. ఆయన కుమారుడుస్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను పరామర్శిస్తున్నారు. అందరిని వరుసలు పెట్టి పిలిచే ఆయన తో గత అనుభూతులను నెమరువేసుకొంటూ తుది వీడ్కోలు పలుకుతున్నారు. నా రాజకీయ గురువు గ్రంధి వెంకటేశ్వర రావు అని ఇటీవలే ప్రకటించిన శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు ఆయన భౌతిక దేహానికి పుష్ప మాలవేసి నివాళ్లు అర్పించారు. గతంలో కాంగ్రెస్ వాదీ, అనేక కీలక పదవులలో ఉన్నపటికీ అన్ని రాజకీయ పార్టీలనేతల ను ఆప్యాయంగా పలకరిస్తూ, దానధర్మాలలో ఆపన్న హస్తంగా, వ్యాపార వర్గాలకు పెద్ద దిక్కు అయిన గ్రంధి వెంకటేశ్వర రావు మృతికి భీమవరం లో అన్ని రకాల వ్యాపారస్తులు , ఆటో తదితర శ్రామిక వర్గాలు స్వచ్చందంగా బంద్ పాటిస్తూ ఆ మహా మనిషికి నివాళ్ళు అర్పిస్తున్నారు.మన సిగ్మా న్యూస్ తరపున మా పెద్దాయన గ్రంధి వెంకటేశ్వర రావు మృతి కి నివాళ్లు అర్పిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సబ్యులకు మనోబలాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకొంటున్నాము
