సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హెచ్1బీ వీసాల ఫీజును లక్ష డాలర్స్ కు ఒక్కసారిగా పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ సెక్టార్‌పై తీవ్ర ప్రభావం చూపనుందనే అంచనాలతో నేడు, సోమవారం నిజానికి అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగానే ఉన్నపటికీ ఐటీ స్టాక్స్ వెనక్కి లాగడంతో దేశీయ సూచీలు నష్టాలను చవిచూశాయి. గత శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగింపు (82, 626)తో పోల్చుకుంటే నేటి సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.(Sensex). సెన్సెక్స్ 81, 997 – 82, 583 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 466 పాయింట్ల నష్టంతో 82, 159 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 124 పాయింట్ల నష్టంతో 25, 202 వద్ద ముగించింది.
