సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తన సాహసాలతో, సినీ ప్రయోగాలతో, దశాబ్దాల క్రిందటే పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమా మార్కెటింగ్ తో 350 సినిమాలలో నటించిన ఏకైక నెంబర్ 1 హీరోగా, డైరెక్టర్ గా , నిర్మాతగా, తెలుగుసిని పరిశ్రమకే కాదు భారతదేశానికే సినీ లెజెండ్ గా ఎదిగిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ కు ఇప్పటికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. హీరో కృష్ణకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యివ్వాలనే ప్రధాన అజెండా తో కె.సుధాస్వామి ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో తాజగా 5 రాష్ట్రాల సీనియర్ కృష్ణ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి సుమారు 500 పాల్గొన్న ఈ ఆత్మీయ సమ్మేళనం లో సూపర్ స్టార్ కృష్ణ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు యివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ అవార్డ్ కు ఆయా రాష్ట్రాల నుండి కృష్ణ పేరు రికమెండ్ చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ను కోరుతూ తీర్మానం ఆమోదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భీమవరంకు చెందిన రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి ఇతర కృష్ణ అభిమానులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *