సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా తో పాటు భారత్ లో ప్రవేశించిన , హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ ఆందోళనల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. గత సోమవారం భారీగా నష్టపోయిన సూచీలు నిన్న మంగళవారం కాస్త కోలుకున్నాయి. అయితే నేడు, బుధవారం మళ్లీ నష్టాల బాటలో సాగుతున్నాయి. గత మంగళవారం ముగింపు (78, 199)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 120 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా కోల్పోయి 78, 082వద్ద కనిష్టానికి చేరుకుంది. హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ ప్రభావం ఇప్పటికే స్టాక్ మార్కెట్ లో మదుపరులు సుమారు 12 లక్షలు పైగా నష్టపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉదయం 10: 20 గంటల సమయంలో 116 పాయింట్లు కోల్పోయి 78, 082 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే స్వల్ప లాభాలతో రోజును ప్రారంభించింది. అయితే ప్రస్తుతం ఉదయం 10:20 గంటల సమయంలో 32 పాయింట్ల నష్టంతో 23, 676 వద్ద కొనసాగుతోంది. అయితే సెన్సెక్స్‌లో రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గెయిల్, ఆయిల్ ఇండియా షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.83గా పడిపోయింది.
