సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా సినీ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా KGF సిరీస్ హిట్స్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కి స్తున్న సినిమా ‘సలార్’. భారతీయ సినీ చరిత్రలో తొలిసారి 6 ఏళ్ళ క్రితం బాహుబలి 2 సినిమా సృష్టించిన సుమారు 2000 వేల కోట్ల వసూళ్ల బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను ఈసినిమా బ్రద్దలు కొడుతుందని భారీ అంచనాలు అభిమానులకు ఉన్నాయి. మరి సినిమా కూడా ఆ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 28న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. హీరో ప్రభాస్ భారీ కటౌట్ కు తగినట్లు ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మా ట్లోనూ విడుదల చేయనున్నట్లు అధికారికం తెలుపుతూ ‘సలార్’ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్ ట్వీ ట్ చేశారు. అమెరికాలో ఈ IMAX వెర్షన్ టికెట్ బుకింగ్స్ కూడా త్వరలోనే ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇండియాలో కూడా ఎంపిక చేసిన ఐమాక్స్ థియేటర్స్ లో ఒరిజినల్ ఐమాక్స్ క్వాలిటితో సలార్ విడుదల చేస్తున్నారు. ఇక తెలుగులో మొదటిసారి ఒరిజినల్ ఐమాక్స్ వెర్షన్లో విడుదలైన సినిమా ‘బాహుబలి2’. మాత్రమే.. ఇప్పుడు మరల ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ తోనే సాధ్యం అవుతుంది. ఐదు భాషల్లో రానున్న ఈ సినిమాలో జగపతిబాబు ప్రధాన విలన్ గా, శృతి హాసన్ , శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నా రు. KGFలోని ‘రాకీబాయి’ కూడా కొద్దీ సేపు ప్రభాస్ తో కల్సి కనిపిస్తారని టాక్.. ఈనెలలోనే ‘సలార్’ ట్రైలర్ విడుదల చేయనున్నారు.
