సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) 2025కు గాను భారీ స్థాయిలో అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 750 పోస్టులను భర్తీ చేస్తారు.. దరఖాస్తు ప్రక్రియ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నేటి సోమవారం తో ముగుస్తుంది. ఆగస్టు 25, 2025. సవరించిన నియమాల ప్రకారం ఆన్‌లైన్ పరీక్ష తేదీ (తాత్కాలికం) ఆగస్టు 31, 2025న జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు iob.in లేదా bfsissc.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వెంటనే తమ దరఖాస్తును సమర్పించవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్న 20-28 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. అలాగే, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) కింద నమోదు చేసుకున్న అభ్యర్థుల గ్రాడ్యుయేషన్ ఫలితాలను 1 ఏప్రిల్ 2021 నుండి 1 ఆగస్టు 2025 మధ్య, రెండు తేదీలతో సహా ప్రకటించాలి.
