సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో తిరుమల తరువాత అతి ఎక్కువ మంది భక్తులు దర్శించి పుణ్యక్షేత్రంగా భాసిల్లు తున్న సద్గురు సాయిబాబా వారి షిర్డీ కి వెళ్లే సాధారణ మధ్యతరగతి ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే ఆద్వర్యంలోని IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే 2 రాత్రులు, 3 రోజులపాటు (రానూపోనూ) ప్రత్యేక షిర్డీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ‘SAI SANNIDHI EX HYDERABAD’ అనే పేరుతో ఈ నెల అక్టోబర్ 29 తేదిన ఈ టూర్ ప్రారంభమవుతుంది.IRCTC వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్రతి బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ప్రయాణం మొదలవుతుంది.. రైలు నెంబర్ 17064 కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. నాగర్ సొల్ చేరుకొని, తరువాత షిర్డీకి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. సింగిల్ షేరింగ్ రూ. 7,890 డబుల్ షేరింగ్ రూ. 6,660 ట్రిపుల్ షేరింగ్ రూ. 6,640 కంఫర్ట్ క్లాస్: ట్రిపుల్ షేరింగ్ రూ. 4,960 డబుల్ షేరింగ్ రూ. 4,980సింగిల్ షేరింగ్ రూ. 6,220 పూర్తీ వివరాలకు IRCTC వెబ్‌సైట్ చుడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *