సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భారత రైల్వే కు సంబంధించి నేడు, మంగళవారం ఉదయం నుండి ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండూ మొరాయించడంతో నేటి ఉదయం నుంచి దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ రెండింటిలో టికెట్ బుక్ చేసుకుంటే.. టికెట్ బుకింగ్ అవకపోవడమే కాకుండా డబ్బులు కూడా కట్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం 8:00 గంటల నుంచి ఐఆర్‌సీటీ సైట్, యాప్ పనిచేయకుండా పోయాయి. అయితే సాంకేతిక సమస్యను పరిష్కరించే వరకు రైలు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ రైల్వే స్టేషన్లలో కౌంటర్ టిక్కెట్ బుకింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
