సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నేడు, ఆదివారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2026 జనవరి సెషన్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పరీక్షలు జనవరి 21 – జనవరి 30, 2026 మధ్య జరుగుతాయని తెలిపింది. IITలు, NITలు ఇంకా, IIITలు సహా అగ్రశ్రేణి సంస్థలలో ప్రవేశం పొందడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. అప్లై చేసుకునేందుకు అవసరమైన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విండో త్వరలో ప్రారంభిస్తారు. రిజిస్ట్రేషన్ లింక్ అధికారిక వెబ్‌సైట్- jeemain.nta.nic.inలో అందుబాటులో ఉంచుతారు. రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయిన సమయంలో, దరఖాస్తు దారులు ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. పరీక్ష రుసుము చెల్లించాలి. వారు రాయదల్చుకున్న పరీక్షా నగరాలను ఎంచుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *