సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నత చదువుల కోసం నిర్వహించే JEE మెయిన్ పరీక్ష తేదీలు(jee-main-exam-dates) ఖరారయ్యాయి. ఈ మేరకు ఎన్టీఏ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను సైతం విడుదల చేసింది. కాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 కు సంబంధించి ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసింది. అభ్యర్థులు jeemain.nta.nic.in ద్వారా తమ పరీక్ష ఏ నగరంలో పడిందో తెలుసుకునే అవకాశం కల్పించింది. 2026 జనవరి 21వ తేదీ నుంచి 29 వరకు షిఫ్టుల వారిగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్టీఏ జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనుంది.
