సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్) ఫలితాలు(JEE Main 2025 Results) నేడు, మంగళవారం విడుదల చేసారు. గత సోమవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ(NTA) అధికారులు.. తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను రిలీజ్ చేసారు. .ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశ వ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 9లక్షల మంది విద్యార్థులు హాజరుఅయ్యారు.. వచ్చే ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరుగుతాయి. మొదటి విడత పరీక్షలో తక్కువ స్కోరువచ్చిన వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండింటిలోటాప్ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆఖరున మొత్తం 2.50లక్షల మందిని ఎన్నిక చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. ప్రస్తుత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి రాంక్ సాదించిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు
