సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం తెల్లవారు జామున ఎన్‌టీఏ .. జేఈఈ మెయిన్స్‌ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా సుమారు 56 మందికి 100 పర్సంటైజ్ రాగా అందులో ఏపీ, తెలంగాణకు చెందిన వారు 22 మంది ఉన్నారు. ఈ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ కు ఎంపిక చేసింది. 100 పర్సంటైల్‌ సాధించిన వారిలో ఏపీ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి 15 మంది విద్యార్థులు ఉన్నారు. జేఈఈ ఫలితాలతో పాటు జాతీయ ర్యాంకులు, రాష్ట్రాల వారీగా టాపర్లు, కటాఫ్‌ ను జాతీయ పరీక్షల విభాగం ప్రకటించింది. జేఈఈ మెయిన్స్‌ పరీక్షను ఈ సారి జనవరి, ఏప్రిల్‌ నెలల్లో రెండు విడతలుగా పెట్టారు. రెండు సెషన్లలలో పాల్గొన్న అభ్యర్థుల స్కోరు ఆధారంగా తుది మెరిట్‌ జాబితాకు పరిగణనలోకి తీసుకోనున్నారు. రెండు సెషన్లకు కలిపి 9, 24, 636 మంది రిజిస్టర్ చేసుకోగా.. 8,22, 899 మంది పరీక్షలకు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *