సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో గృహిణులకు హోటల్స్ కు ముఖ్య గమనిక. ఎల్పీజీ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకర్ల సమ్మెతో రాష్ట్రంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు. బల్క్ ఎల్పీజీ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన కొత్త టెండర్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ ప్రాంత బల్క్ ఎల్పీజీ ట్రాన్స్‌పోర్టర్లు ఈ నెల 27 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు ఎల్పీజీని రవాణా చేసే ట్రాన్స్‌పోర్ట్ లారీలు నిలిచిపోయాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1.56 కోట్ల కుటుంబాలు వంట గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నాయి. సమ్మె కనుక ఎక్కువ రోజులు కొనసాగితే.. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు రీఫిల్ చేసే బాట్లింగ్ ప్లాంట్లకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీల్ తదితర చమురు శుద్ధి కర్మాగారాల నుంచి ఎల్పీజీ రవాణా నిలిచిపోవడంతో ఆయా ప్లాంట్లలో సిలిండర్ల రీ ఫిల్లింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడనుంది.
