సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆక్వా రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఆక్వా రైతులకు అండగా ఉంటామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఇటీవలే అసెంబ్లీ సమావేశంలో ఆక్వా రైతుల సమస్యలను తెలియజేసిన సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబును వారి కార్యాలయంలో జిల్లాలోని ఆక్వా రైతులందరూ కలిసి ఘన పుష్పా సన్మానం చేశారు. ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అంజిబాబు గళం విప్పిన సందర్భంగా మా ఆక్వా రైతులందరం హర్షం ప్రకటిస్తూ సత్కరించుకుంటున్నామని ఆక్వా రైతులు అన్నారు.
