సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త , వైసీపీ పార్టీ MLC వంకా రవీంద్ర నాథ్ తల్లి వంకా నాగ మణి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా తణుకు లో నేడు, సోమవారం శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వంకా నివాసానికి వెళ్లి నాగమణి గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వంకా రవీంద్ర నాథ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.. మన ‘సిగ్మా న్యూస్’ తరపున కూడా సుదీర్ఘ కాలంగా మాకు సుపరిచితులు వంకా రవీంద్రనాద్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాము.
