సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు షేక్ సాబ్జీ ఈ రోజు ఉదయం ఉండి మండలం చెరుకువాడ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి లో వారి పార్థివ దేహానికి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు నివాళులర్పించారు ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ.. షేక్ సాబ్జీ గారి మరణం తనను కలచివేసిందని, ఉపాధ్యాయ,ఉద్యోగ వర్గాలకు తీరని లోటని, శాసనమండలి లో షేక్ సాబ్జీ ఉపాధ్యాయ వర్గాల సమస్యల కోసం వారి గొంతుకగా మారి నిబద్దత తో పనిచేశారని ఆయన అన్నారు. నేటి ఉదయం పాలకొల్లు లో ప్రముఖ సినీ దర్శకుడు బాపు( కార్టూనిస్ట్ కీ. శే. శ్రీ సత్తిరాజు వెంకట లక్ష్మీ నారాయణ )గారి 91 వ జయంతి సంద్భంగా పాలకొల్లు ఆర్టిస్ట్ & పెయింటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలకొల్లు లో ఏర్పాటు చేసిన బాపు గారి విగ్రహాన్ని శాసన మండలి చైర్మన్,కొయ్యే మషేను రాజు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో పట్టణ YSRCP నాయకులు యడ్ల తాతాజీ గారు మరియు పట్టణ ప్రమఖులు పాల్గొన్నారు.
