సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో .. తెలంగాణ హైకోర్టు లో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు శనివారం సీబీఐ వాదనలు వినిపించింది. మొత్తం మీద.. కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వచ్చే బుధవారం నాడు తుది తీర్పు వెలువరించనుంది. బుధవారం లోపు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అవినాశ్ చేసిన అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. బుధవారం తీర్పు వెలువరించేవరకూ అవినాశ్‌ను అరెస్ట్ చేయవద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక వివరాలలోకి వెళ్ళితే శుక్రవారం నాడు అవినాశ్ తరపు లాయర్, సునీత తరపు లాయర్ వాదనలను తెలంగాణ హైకోర్టు విన్న సంగతి తెలిసిందే. నేడు శనివారం సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని, ఎన్నిసార్లు నోటీసులిచ్చినా అవినాశ్‌రెడ్డి పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపింది.అయితే సిబిఐ ని కోర్ట్ అనేక సూటి ప్రశ్నలు అడగడం జరిగింది. అవినాష్ రెడ్డి ఎంపీ కి వైసీపీ పార్టీ టికెట్ ముందే కన్ఫర్మ్ అయ్యాక దానికి ఇంకా వివేకానంద ఫై కుట్ర చెయ్యవలసిన అవసరం ఏమిటి?ఎన్నికలలో మేనేజ్ చేసి ఉండొచ్చు కదా..హత్య వరకు వెళ్తారా? కేవలం రక్తం కడగటం తో ఆధారాలు మాయం అవుతాయా?, మృతుడి దేహాన్ని చుస్తే అది హత్య అని తెలుస్తుందా? లేదా? .. అవినాశ్ ఆ టైమ్‌లో ఇంట్లోనే ఉన్నాడని ఎలా చెబుతారు? ఈ హత్య గురించి అవినాశ్‌కు ముందే తెలుసు? అనడానికి ఏం ఆధారాలున్నాయి? మరో ప్రధాన నిందితుడు గంగిరెడ్డి వాట్సాప్ చాట్ గురించి అడిగారా? అని హైకోర్టు సిబిఐ ని ప్రశ్నించడం జరిగింది.
