సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన N కన్వేషన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. కాగా.. N కన్వేషన్ కూల్చివేతపై సినీనటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్-కన్వెన్షన్ కూల్చడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు. ఎన్-కన్వెన్షన్ పట్టా భూమిలో కట్టామని.. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని నాగార్జున పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులపై స్టే కూడా ఇచ్చారన్నారు. తనకు ముందస్తు ఎలాంటి నోటీసులివ్వకుండా కూల్చడం సరికాదన్నారు. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటే నేనే కూల్చేవాడినంటూ పేర్కొన్నారు. ఒక్క అంగుళం చెరువు ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని..కూల్చివేత చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు.ఈ పరిణామాల వల్ల తాను అక్రమ నిర్మాణాలు చేశామని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున స్పష్టంచేశారు.
